Posts

అత్యున్నత సింహాసనముపై

Image
                         అత్యున్నత   సింహాసనముపై పల్లవి :       అత్యున్నత   సింహాసనముపై - ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతుము నిన్నే ఆహాహా ... హల్లేలూయ   (4X) ఆహాహా ... హల్లేలూయ   (3X)  ... ఆమెన్ 1.           ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి   స్తోత్రం … ఆహాహా … 2.           కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే  -   నా రక్షణకర్తా స్తోత్రం … ఆహాహా … 3.           ఆమేన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం … ఆహాహా … 4.           మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘవాహనుడా స్తోత్రం … ఆహాహా …

ఆడెదన్ పాడెదన్

Image
                                     ఆడెదన్ పాడెదన్ పల్లవి :      ఆడెదన్ ,  పాడెదన్ ,  యేసుని సన్నిధిలో యేసుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో ఆడెదన్ ,  పాడెదన్ ,  యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో 1.           నను దర్శించి నూతన జీవం యిచ్చిన సన్నిధిలో నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో                               (2X) ఆడెదన్ ,  పాడెదన్   దేవుని సన్నిధిలో స్తుతించెదన్   స్తుతించెదన్ ఆరధించెదన్   ఆరధించెదన్ దేవుని సన్నిధిలో ఆడెదన్ ,  పాడెదన్ ,  యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో ఉజ్జీవ మిచ్చిన దేవుని సన్నిధిలో 2.           పరిశుద్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో పరిశుద్దాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో                       (2X) ఆడెదన్ ,  పాడెదన్   దేవుని సన్నిధిలో స్తుతించెదన్   స

అపరాధిని యేసయ్య

Image
                            అపరాధిని యేసయ్య పల్లవి :      అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు  .. అపరాధిని .. 1.           సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా   .. అపరాధిని .. 2.           ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో        .. అపరాధిని .. 3.           ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ              .. అపరాధిని .. 4.           దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను       .. అపరాధిని .. 5.           ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా           .. అపరాధిని ..

అందాల తార

Image
                      అందాల తార పల్లవి :      అందాల   తార అరుదెంచె నాకై - అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో ఆది దేవుని జూడ - అశింపమనసు   –   పయనమైతిమి                              ..   అందాల   తార .. 1.           విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్     ..   అందాల   తార .. 2.           యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు       ..   అందాల   తార .. 3.           ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన